కూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కన్న తండ్రి

0 comments

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు పుట్టడం లేదని భార్యపై కోపంతో ఓ వ్యక్తి కన్న కూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దాంతో ఆ బాలిక శరీరం దాదాపుగా కాలిపోయింది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కర్నూలు తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో ఆ బాలికను కర్నూలు తరలించారు. ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు బాలిక తండ్రిపై కేసు నమోదు చేశారు.అయితే నిందితుడు పరారిలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

Source: Sakshi News
Share this article :

Post a Comment

 
Support Us : Fuzail | Pradeep |SHABAAZ SHAIKZ
Copyright © 2013. mycity kurnool - All Rights Reserved