నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కన్నుమూత
ప్రముఖ హాస్య నటడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం(53) శనివారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన దిల్షుక్నగర్లోని తన స్వగృహంలోని తుది శ్వాసవిడిచారు. ఆనందో బ్రహ్మ కార్యక్రమంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్రహ్మణ్యం అకస్మిక మృతి సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పటి వరకూ ఆయన 750 పైగా చిత్రాల్లో నటించారు. జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో ధర్మవరపు సినీ ప్రస్థానం మొదలైంది. ఆయన తోకలేని పిట్ట సినిమాకు దర్శకత్వం వహించారు.
ఆయన గతంలో రాష్ట్ర సాంస్కృతికి మండలి ఛైర్మన్ గా సేవలందించారు. ప్రకాశం జిల్లాలోని కొమ్మునేని వారి పాలెంలో పుట్టిన ఆయన తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొంత కాలం నుంచి సాక్షి టీవీలోని డింగ్ డాంగ్ కార్యక్రమానికి యాంకర్ గా పని చేస్తున్నారు
source: Sakshi

Post a Comment