రాష్ట్ర విభజన ప్రక్రియ జోరుగా సాగుతున్న సందర్భంలో సీమాంధ్రపై కొన్ని డిమాండ్లతో కేంద్రానికి నివేదించేందుకు వెళ్లిన కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డికి ఢిల్లీలో చుక్కెదురైంది. తన డిమాండ్లను గురువారం జీవోఎంకు నివేదించారు. అయితే ఆ డిమాండ్లేవీ నెరవేర్చలేమని కోట్లకు కేంద్రం చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో చేసేదేమి లేక ఆయన అలిగి ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమైనట్లు విశ్వసనీయ సమాచారం.
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి నివేదించిన ముఖ్య డిమాండ్లలో ఒకటి కర్నూలు, అనంతపురం కలిపి రాయల తెలంగాణ చేయాలి. రెండవది సీమాంధ్రకు కర్నూలును రాజధాని చేయాలి, మూడవది ప్రత్యేక రాయలసీమ. ఈ డిమాండ్లకు సంబంధించి పూర్తి వివరాలను ఆయన జీవోఎం ఎదుట సమర్పించినట్లు తెలిసింది.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాయల తెలంగాణ అంశం పక్కన పెట్టాలని, విభజన తర్వాత దానిపై ఆలోచిద్దామని కేంద్రం చెప్పడంతో ఆయన తీవ్ర అసంతప్తికి లోనయినట్లు తెలిసింది. తన డిమాండ్లలో ఏ ఒక్క దానికి పరిష్కారం చూపకపోవడంతో తిరుగు ప్రయాణం అయినట్లు మంత్రి కోట్ల వర్గీయులు తెలిపారు.
source: Sakshi
Post a Comment