హైదరాబాద్ : స్టేడియం లోపల జనహోరు.... స్టేడియం బయట జనం బార్లు.... 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ జరుగుతున్న ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పరిస్తితి ఇది. సభకు వచ్చిన వారితో స్టేడియం మొత్తం నిండిపోయింది. స్టేడియంలోని స్టాండ్లన్నీ నిండిపోయాయి. గ్రౌండ్ లోపల వేసిన కుర్చీలు కూడా నిండుతున్నాయి. ప్రవేశ ద్వారాల వద్ద ఇంకా వందలమంది సంఖ్యలో ఉద్యోగులు వేచి ఉన్నారు. దూరాభారాన్ని లెక్కచేయకుండా సీమాంధ్ర జిల్లాల నుంచి ఉద్యోగులు తరలి వస్తున్నారు.
సాంస్కృతిక వేదికగా నామకరణం చేసిన 'గురజాడ అప్పారావు' వేదికపై నుంచి కళాకారులు ఉద్యోగులకు స్వాగతం పలుకుతున్నారు. అయితే 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభపై బంధ్ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. ఎంతో ఉత్సాహంగా దూరప్రాంతాల నుంచి ఉద్యోగులు సభకు వస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభం కానుంది.
స్టేడియంకు దారితీసే మార్గాలన్నీ సమైక్యాంద్ర ఉద్యోగులతో కిక్కిరిపోయాయి. పోలీసు కంట్రోల్ రూమ్ దగ్గర ఏర్పాటు చేసిన ద్వారం నుంచి ఉద్యోగులంతా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. గుర్తింపు కార్డులను పరిశీలించి పోలీసులు ఉద్యోగులను లోనికి పంపిస్తున్నారు. వందల సంఖ్యలో ఉద్యోగులు ర్యాలీగా స్టేడియంకు వస్తున్నారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి.
source: sakshi news