కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. హిమబిందు అనే 24 అధ్యాపకురాలు అటవీ ప్రాంతంలో దారుణ హత్యకు గురైంది. సహోద్యోగి ఆ దారుణానికి ఒడిగట్టాడు. కర్నూలులోని విద్యానగర్‌కు చెందిన నాగరత్నరావు, మధుమతి దంపతుల కూతురు హిమబిందు బి ఫార్మసీ పూర్తి చేసింది. 2013 జూన్‌లో స్థానిక అబ్దుల్లాఖాన్ ఎస్టేట్‌లోని ఓ కార్పోరేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా చేరింది. గత ఏడాది డిసెంబర్ 24వ తేదీన ఉద్యోగం మానేసిదంి. జనవరి 1వ తేదీ ఉదయం ఆరున్నరకు హిమబిందుకు ఫోన్ వచ్చింది. తన సహోద్యోగి జన్మదినం విందుకు వెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పి బయటకు వెళ్లింది. ఇక తిరిగి రాలేదు. ఆ రోజు రాత్రయినా రాకపోయేసరికి కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఫోన్ చేసింది కడప జిల్లా తంబాలపల్లె వాసి బలరాంరెడ్డిగా గుర్తించారు. వారు అతన్ని పోలీసులకు అప్పగించారు. జనవరి 2వ తేదీన హిమబిందు అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలావుంటే, జనవరి 7వ తేదీన శిరువెళ్ల మండల పరిధిలోని అడవిలో కాలువ ఒడ్డున ఓ యువతి శవాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాలి ఉండడంతో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి నంద్యాలలో శవపరీక్ష చేయించి ఖననం చేయించారు. బలరాంను పోలీసులు విచారించగా హిమబిందు హత్యోదంతం వివరాలు బయటపడ్డాయి. బలరాం హిమబిందుకు ఫోన్ చేసి తన జన్మదినమంటూ శిరువెళ్ల పరిధిలోని నల్లమల ప్రాంతానికి తీసుకుని వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, కోపంలో అతడు ఆమెను కాలువలో ముంచేసి చంపేసినట్లు తెలుస్తోంది. బలరాంతో పాటు వెంకటేష్ గౌడ్, మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. నాణ్యమైన వార్తలను అందిస్తున్న వన్ఇండియా... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ ల ద్వారా మరిన్ని అప్‌డేట్స్
Read more at: http://telugu.oneindia.in/news/andhra-pradesh/lady-lecturer-killed-kurnool-district-129617.html
source: One India Telugu
Read more at: http://telugu.oneindia.in/news/andhra-pradesh/lady-lecturer-killed-kurnool-district-129617.html
source: One India Telugu
Post a Comment