రైలు కింద‌ప‌డి పది మంది ప్రయాణికుల దుర్మరణం

0 comments

విజ‌య‌న‌గ‌రం:
 జిల్లాలోని గొట్లాం స‌మీపంలో దీపావ‌ళి పండుగ‌పూట విషాదం చోటుచేసుకుంది. రైలు కింద‌ప‌డి పది మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు.   సిగ్నల్ లేకపోవడంతో బొకారో రైలు అక్కడే ఆగిపోయింది. అప్పుడే బొకారొ ఎక్స్ ప్రెస్ -1, ఎస్‌-2 బోగీల్లో పొగ‌లు, మంటలు చెలరేగాయంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు భయపడి రైలులో నుంచి ఒక్కసారిగా పక్క ట్రాకుపై దూకారు.

ప్ర‌య‌ణికులంతా చైన్‌లాగి హ‌డావుడిగా దూక‌డంతో, అదే స‌మ‌యంలో పక్క ట్రాక్ పైకి దూసుకొచ్చిన విజయవాడ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో  పది మంది మృతి మృతిచెందిన‌ట్టు స‌మాచారం. పలువురు గాయపడ్డారు. రైలు ఒక్క‌సారిగా ఢీకొట్ట‌డంతో ట్రాక్‌పై మృత‌దేహాలన్ని చిధ్ర‌మైయ్యాయి. తెగిప‌డిన అవ‌య‌వాల‌తో ట్రాక్ భ‌యంక‌రంగా క‌నిపిస్తోంది. మృతుల్లో చిన్నారులు, మ‌హిళ‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. మృతుల్లో బెంగాల్ వాసులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉందని చెబుతున్నారు.
Source: Sakshi news
Share this article :

Post a Comment

 
Support Us : Fuzail | Pradeep |SHABAAZ SHAIKZ
Copyright © 2013. mycity kurnool - All Rights Reserved